కులధ్రువీకరణకు మార్గదర్శకాలు | Caste validation guidelines | Sakshi
Sakshi News home page

కులధ్రువీకరణకు మార్గదర్శకాలు

Published Sat, Aug 9 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

Caste validation guidelines

జారీ చేసిన తెలంగాణ సర్కార్
 
హైదరాబాద్:  ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పుట్టినతేదీ, స్థానికత, కులధ్రువీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీచేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మార్గదర్శకాలనే తెలంగాణకు అన్వయించింది. ఈ మేరకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి టి. రాధ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉన్న చోట తెలంగాణ రాష్ట్రం అని ప్రభుత్వం మార్చింది. ఎస్టీలకు మాత్రం ప్రస్తుతం ఉన్న తరహాలోనే తండ్రితో పాటు తాత ధ్రువీకరణను కూడా నిర్ధారించాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్నట్టు ఎస్సీ, ఎస్టీ వర్గాల కింద ఏయే కులా లు వస్తాయనే జాబితాను ఇచ్చింది. అదేవిధంగా  సాంఘిక సంక్షేమం ఉన్నచోట షెడ్యూల్ కులాల అభివృద్ధి అని మార్చింది. రాష్ట్రస్థాయిలో స్క్రూ టినీ, రివ్యూకమిటీ చైర్మన్‌గా షెడ్యూల్డ్‌కులాల అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి / కార్యదర్శి వ్యవహరిస్తారు.

సభ్యులుగా గిరిజన, బీసీ సంక్షేమశాఖల ముఖ్యకార్యదర్శులు, షెడ్యూల్డ్ కులాలు, తరగతుల, బీసీ సంక్షేమ శాఖల కమిషనర్లు, సీబీసీఐడీ ఇన్‌స్పెక్టర్ సభ్యులుగా ఉంటారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి/జాయింట్ సెక్రటరీ/ డిప్యూటీ సెక్రటరీ  మెంబర్ కన్వీనర్‌గా  వ్యవహరిస్తారు. జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా రెవెన్యూ అధికారి మెంబర్ సెక్రటరీగా,  షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన  బీసీ సంక్షేమ  డిప్యూటీ డెరైక్టర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, పౌరహక్కుల పరిరక్షణ/ విజిలెన్స్‌సెల్‌లకు చెందిన అధికారి, షెడ్యూల్ కులాల/ గిరిజన సంక్షేమ కమిషనరేట్‌లలో పరిశోధనాసంస్థ అధికారి సభ్యులుగా ఉంటారు. బీసీలకు సంబంధించి ఏబీసీడీ గ్రూపులకు  మండల పరిధిలో ఎమ్మార్వోలు, ఎస్సీలలో  ఆది ఆంధ్ర, ఆదిద్రావిడ, అరుంధతీయ, దోమ్, దొంబర, పైడి, పానో, మాదిగ, మాల, మాలదాసరి, మాలదాసు, మాలసాలె, నేత్కాని, మన్నె, పంచమ, పరియా, రెల్లి కులాలకు సంబంధించి  మండల పరిధిలో ఎమ్మార్వోలు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఇంకా ఎస్సీలలో అనముక, ఆరే మాల, అర్వ మాల, బావురి, బేడజంగం, బుడగజంగం, బైండ్ల, బ్యాగర, చంచటి, చాలవడి, చమర్, మోచి, ముచి, చాంభర్, చండాల, డక్కలి డొక్కలవార్, దండాసి, ధోర్, ఎల్లమల్వార్, ఎల్లమ్మల వాండ్లు, ఘాసి, హద్ది, రెల్లి చంచడి,  గోడగల్లి, గోదరి, గోసంగి, హోలేయా, హోలేయా దాసరి, జగ్గలి, జాంభవులు, కొలుపులవాండ్లు, మదాసి కురువ, మదారి కురువ, మాదిగ దాసు, మష్టిన్, మహర్, మలన్ హన్నాయ్, మాల జంగం, మాలమస్తి, మాలసన్యాసి, మంగ్, మం గ్‌గరోడి, మస్తి, మాతంగి, మెహతర్, మిత్తిల అయ్యవార్, ముండాలా, పాకీ, మోతీ, తోటి, పంబాల, పంబండ, పమిడి, సమాగార, సంబన్, సప్రు, చింధోల్లు, చిందుల్లులకు సంబంధించి ఆర్‌డీఓ/సబ్‌కలెక్టర్/అసిస్టెంట్ కలెక్టర్ హోదాకు తక్కువ కాని అధికారులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు.

అలాగే, షెడ్యూల్డ్ తెగలు, గిరిజన వర్గాలకు సంబంధించి అంధ్, భగట,భిల్, చెంచు, చెంచువార్, గదబలు, గోండు, నాయక్‌పోడు, రాజుగోండు, జఠాపస్, కతునాయకన్, కోలం, మన్నెర్వర్లు, కోండ్స్, కోడి, కోధు, దేశాయ, కోండ్స్, డోంగ్రయా కోంద్స్, కుధియా కోండ్స్, ఎనిటి కోండ్స్, కోయ, గౌడ్, రాజా, రాషాకోయ, లింగధారి కోయ(ఆర్డినరీ), కొట్టుకోయ, బినికోయ, రాజ్‌కోయ, మాలీలు (ఆదిలాబాద్,హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ మినహాయించి), ముఖదొర,నూకదొర, పర్దాన్, పోర్జ, పరంగిపెర్జ, రోన,రేనా, సవర, కాపుసవరలు, మలియా సవరాలు, కుట్టో సవరలు,సుగాలీలు, లంబాడీలు, కులీయా, యానాదులు, ఎరుకల వారికి మండల పరిధిలో ఎమ్మార్వోలు సర్టిఫికెట్లు ఇస్తారు. షెడ్యూల్డ్ కులం బరికి సంబంధించి జిల్లా కలెక్టర్ పరిధిలో, షెడ్యూల్డ్‌తరగతులకు సంబంధించి కొండకాపులు, కొండరెడ్డిలు, హిల్‌రెడ్డిలు, గౌడు( ఏజెన్సీలలో), కమ్మర, కోటియా, బెంతోఒరియా, బర్తికా, ధూలియా, ఢులియా, హోల్వో, పైకో, పుతియా, సన్ రోనా, సిదపైకో, రెడ్డిదొర, కొండదొరలు, తోటి (ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ మినహాయించి) నాయకా (ఏజెన్సీలలో), వాల్మీకి(ఏజెన్సీలలో) మన్నెదొర ఆర్‌డీఓ/సబ్‌కలెక్టర్/అసిస్టెంట్ కలెక్టర్‌లు సర్టిఫికెట్లు జారీచేసేందుకు అధికారాలు కలిగి ఉన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement