స్పీకర్‌కు సీఐటీయూ నాయకుల వినతి
గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయి.. ఇప్పటి వరకు జరిగిన వివిధ కుంభకోణాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శాససనభ స్పీకర్ మధుసూదనాచారిని కోరారు. ఈ మేరకు వారు కార్మికుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా పలు విషయాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.
సింగరేణిలో జరుగుతున్న అనేక అవినీతి సంఘటనలపై ఎన్నోసార్లు ప్రకటనల ద్వారా, వినతిపత్రాల ద్వారా ఉన్నతాధికారులకు తెలిపినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. బొగ్గు అమ్మకాలు, గ్రేడింగ్, తూకం, ఓబీ తొలగింపు, పరికరాల కొనుగోలు, నిర్మాణాలు, మరమ్మతులు, బిల్లుల చెల్లింపులు, ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు, మెడికల్ బోర్డులో ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోందని అయినా గుర్తింపు సంఘంగా గెలిచిన యూనియన్లు పట్టించుకోకపోవడం దురదుష్టకరమన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా బంగారు తెలంగాణ రూపుదిద్ధుకోవాలంటే రాష్ట్రంలో పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిని ప్రక్షాళన చేయాలని వారు కోరారు. ఈ విషయంలో స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎస్‌సీఈయూ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారావు తదితరులు తెలిపారు.
అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి
Published Fri, Nov 14 2014 1:44 AM | Last Updated on Mon, Oct 8 2018 3:41 PM
Advertisement
Advertisement