ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారత అభిమానుల సంబరాలలో విషాదం జరిగింది.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారత అభిమానుల సంబరాలలో విషాదం జరిగింది. బాణాసంచా పేలడంతో ఏడుగురికి గాయాలయిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి... దాయాది పాకిస్థాన్ తో తలపడిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించడంతో అభిమానులు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేలుస్తుండగా ఓ గిఫ్ట్ షాపులో పడి మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురు గాయపడటంతో పాటు రూ.7 లక్షల నష్టం వాటిల్లిందని షాపు యజమాని తెలిపారు. గాయపడిన వారిలో ఓ నాలుగేళ్ల చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.