
సెల్’కిల్..!
బొంరాస్‌పేట: సెల్‌ఫోన్ సాఫీగా సాగుతున్న సంసారంలో చిచ్చుపెట్టింది. వివాహేతర సంబంధాన్ని అంటగట్టి ఓ ఇల్లా లు ప్రాణం తీసింది.
బొంరాస్‌పేట: సెల్‌ఫోన్ సాఫీగా సాగుతున్న సంసారంలో చిచ్చుపెట్టింది. వివాహేతర సంబంధాన్ని అంటగట్టి ఓ ఇల్లా లు ప్రాణం తీసింది. ఫోన్‌లో వివాహేతర సంబంధం కలిగి ఉన్నవ్యక్తితో తరచూ మాట్లాడుతుందని అనుమానించిన ఓ భర్త భార్యను దారుణంగా హతమార్చా డు. ఆపై మృతదేహాన్ని దహనం చేసి తా ను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి పరారయ్యాడు.
స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన సోమవారం మండలకేంద్రంలో వెలుగుచూసింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. కొడంగల్‌కు చెందిన నందారం మిడిదొడ్డి రాజేందర్, మురళమ్మ రెండోకూతురు స్వప్నశ్రీ(32)ను 17ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం మోమిన్‌కల్ గ్రామానికి చెందిన రాజుగుప్తకు ఇచ్చి వివాహం చేశారు. రాజు కిరాణావ్యాపారం నిర్వహిస్తూ రాజకీయాల్లో తిరుగుతున్నాడు. స్వప్నశ్రీ స్థానికంగా ఓ ప్రైవే ట్ పాఠశాలలో పనిచేస్తుంది. వీరికి కూతురు విణీత, కొడుకు భరత్ ఉన్నారు.
కాగా, తనభార్య స్వప్నశ్రీ రహస్యంగా సెల్‌ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతుందని రాజు అవమానించాడు. అలాగే తన భర్త కూ డా ఇతరులతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఆమె అనుమానించసాగింది. వీరిఅన్యోన్య దాంపత్యజీవితం చెదిరి అనుమానాలు పెరిగాయి. ఈ క్రమంలో స్వప్నశ్రీ తనమామ పెంటయ్య(భర్త తండ్రి) వద్ద ఉంటుంది. రాజు తన భార్యను కొడంగల్‌కు తీసుకెళ్తున్నానని చెప్పి సోమవారం రాత్రి కారులో తీసుకెళ్లాడు.
మార్గమధ్యంలో స్వప్నశ్రీని హత్యచేసి తన అన్నదమ్ములు, భార్య కుటుంబసభ్యులకు ఫోన్‌ద్వారా విషయం చెప్పాడు. కొద్దిసేపటికి బొంరాస్‌పేట శివారులోని సంఘయ్యగడ్డ శివాలయం సమీపంలో దహనం చేశానని, తాను సైతం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలియజేసి ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన రాజుగుప్త అన్నదమ్ములు నర్సిములు, మాణిక్‌ప్రభు, వీరేశం శివాలయం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వెతకగా కాలిపోయిన స్థితిలో ఉన్న స్వప్నశ్రీ మృతదేహం లభ్యమైంది. మృతురాలు దివంగత ఎమ్మెల్యే నందారం నడిదొడ్డి వెంకటయ్య మనవరాలు, దివంగత ఎమ్మెల్యే నడిదొడ్డి సూర్యనారాయణ తమ్ముడు కూతురు.
సీఐ విచారణ
హత్యజరిగిన స్థలాన్ని మంగళవారం ఉదయం కొడంగల్ సీఐ విశ్వప్రసాద్ సందర్శించి పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
పరారీలో నిందితుడు ?
తన భార్యను హత్యచేసి తానూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఫోన్‌ద్వారా కుటుంబీకులకు రాజుగుప్త చెప్పినప్పటికీ తన కారులోనే తిరిగి ధారూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడని, అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో ఉన్నట్లు మృతురాలి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే నందా రం సూర్యనారాయణ భార్య అనురాధ, టీడీపీ నేత నర్సిములుగౌడ్, సీపీఐ నాయకుడు ఇందపూర్ బషీర్ సంఘటన స్థలానికి వచ్చి పరామర్శించారు.