హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని, పజల హక్కులు కాలరాస్తోందని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఘట్‌కేసర్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్‌లు లేని తెలంగాణ తెస్తానని చెప్పి మాట తప్పాడని కేసీఆర్‌ను దుయ్యబట్టారు. శ్రుతి, సాగర్‌ల హత్యలు ప్రభుత్వ హత్యలేనని ఆయనన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా 376 ప్రజాసంఘాలతో కలిసి తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక తరపున పోరాటం చేస్తామని తెలిపారు. ఈ నెల 30న తలపెట్టిన చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం దానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను చాడ వెంకటరెడ్డి విడుదల చేశారు.
'ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది'
Published Sun, Sep 27 2015 5:07 PM | Last Updated on Tue, Aug 14 2018 2:34 PM
Advertisement
Advertisement