సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు మున్సిపాలిటీలకు కొత్త సారథులు ఎన్నికయ్యారు. పోలింగ్ నిర్వహించిన రెండు నెలల విరామం తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక తంతు పూర్తిచేయడంతో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. దాదాపు నాలుగేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగిన పురపాలక సంఘాల పాలన.. గురువారంతో ముగిసింది. కొత్త సారథులు కుర్చీల్లో ఆసీనులు కావడంతో పురపాలికలు కళాత్మకంగా కనిపించాయి.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు గురువారం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేసి కుర్చీలు దక్కించుకున్నాయి. మేజిక్ సంఖ్య ఉన్నప్పటికీ పొరుగు పార్టీల ప్రలోభాలకు తలొగ్గకుండా ఆయా పార్టీలు జాగ్రత్తపడ్డాయి. దీంతో ఎన్నిక ప్రక్రియ అంతా ఏకగ్రీవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ ఒక పురపాలక సంఘాన్ని దక్కించుకోగా, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్‌లు చెరో రెండు పురపాలక సంఘాలను సొంతం చేసుకున్నాయి.
కొలువుదీరిన కొత్త సారథులు
Published Thu, Jul 3 2014 11:44 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement