విలువలకు కట్టబడ్డ నేత చక్రపాణి: రోశయ్య | chakrapani is boundary with values, says roshaiah | Sakshi
Sakshi News home page

విలువలకు కట్టబడ్డ నేత చక్రపాణి: రోశయ్య

Published Sun, Aug 9 2015 7:25 PM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

విలువలకు కట్టబడ్డ నేత చక్రపాణి: రోశయ్య - Sakshi

విలువలకు కట్టబడ్డ నేత చక్రపాణి: రోశయ్య

నాంపల్లి (హైదరాబాద్): రాజకీయాల్లో విలువలకు కట్టుబడి పనిచేసిన నాయకుల్లో డాక్టర్ ఎ.చక్రపాణి ఒకరని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ చక్రపాణి కుమార్తె రేగుల సునీత రచించిన ‘మై డాడ్’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం నాంపల్లిలోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తమిళనాడు గవర్నర్ రోశయ్య హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చక్రపాణి నిగర్వి అని అన్నారు. ప్రతి పక్షాల నేతలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా పేర్కొన్నారు. రేగుల సునిత రచించిన 'మై డాడ్' అందరూ చదవాల్సిన పుస్తకమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఈ పుస్తకాన్ని చదివితే తండ్రి గొప్పదనం తెలుస్తుందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement