సాక్షి, హైదరాబాద్: అఘాయిత్యాల బారినపడిన చిన్నారులకు సత్వర న్యాయం అందించడానికి దేశంలోనే తొలిసారిగా నగరంలో ఏర్పాటైన చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తిని కేటాయించనున్నారు. ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తులు పోలీసు ఉన్నతాధికారులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. హాకా భవన్‌లో ఉన్న ఈ కోర్టును సందర్శించిన హైకోర్టు సీజే జస్టిస్ రాధాకృష్ణన్, ఇతర న్యాయమూర్తులు పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల విచారణ వేగంగా పూర్తి కావాలంటే ప్రత్యేక న్యాయమూర్తి అవసరమన్న పోలీసుల ప్రతిపాదనపై సీజే సానుకూలంగా స్పందించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బృందం చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టుతో పాటు భరోసా కేంద్రం, షీ–టీమ్స్‌ను సందర్శించింది. ఈ కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, కొత్వాల్ అంజనీకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment