‘మీ లవ్వు మీద మన్నువడ’ | Cinema Shooting In Medak | Sakshi
Sakshi News home page

‘మీ లవ్వు మీద మన్నువడ’

Jul 24 2018 9:23 AM | Updated on Oct 16 2018 3:15 PM

Cinema Shooting In Medak - Sakshi

శనిగరంలో షూటింగ్‌ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే  

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): మండలంలోని శనిగరం, చిన్నకోడూర్‌ మండలంలోని అనంతసాగర్‌ గ్రామంలోని సరస్వతి క్షేత్రంలో విశ్వకర్మ క్రియేషన్, హరిక్రిష్ణ క్రియేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మీ లవ్వు మీద మన్నువడ’ అనే కొత్త సినిమా చిత్రికరణను హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ క్లాప్‌ కొట్టి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నూతన నటీనటులకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం అభినందనీయమన్నారు. తెలంగాణ యాసాభాషలో రూపోందింస్తున్న ఈ సినిమా మంచి ఆదరణ పోందాలని ఆకాంక్షించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు భారవి, వంశీధర్‌రావు, రష్మిఠాకూర్, మానస్, తేజరెడ్డి, కెమెరామెన్‌ భాస్కర్, సంగీత దర్శకులు అర్జున్‌ శర్మ, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement