టెక్స్‌టైల్ యూనిట్ల అనుమతులు రద్దు
పాశమైలారం పార్కుపై మంత్రుల సమీక్ష
* ఆగస్టు 21లోగా కార్యాచరణ ప్రణాళిక
* ఈటీపీ నిర్మాణానికి ఏడాదికి పైగా గడువు
* టెక్స్‌టైల్ పార్కులో రాజ్యమేలుతున్న సమస్యలు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా పాశమైలారం టెక్స్‌టైల్ పార్కులో ప్లాట్లు కేటాయించినా పనులు ప్రారంభించని యూనిట్ల అనుమతులు రద్దు కానున్నాయి. ఆగస్టు 21లోగా పార్కు స్థితిగతులపై సంపూర్ణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించే బాధ్యత పరిశ్రమల శాఖ కార్యదర్శికి అప్పగించారు.
పార్కులో మౌలిక సౌకర్యా ల కల్పనకు సంబంధించిన అంశాలపై నిరే ్ధశిత వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృ ద్ధి సంస్థ (టీఎస్ ఐఐసీ) సూచనలు అందజేయాల్సి ఉంటుంది. కాలుష్య వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు (ఈటీపీ) నిర్మాణాన్ని 12 నుంచి 16 నెలల వ్యవధిలో పూర్తి చేయాలి. అనుమతులు రద్దు చేసిన యూనిట్లను తిరిగి ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులకు కేటాయించనున్నారు. పార్కు నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సీని యర్ అధికారిని నియమిస్తారు.
మెదక్ జిల్లా పాశమైలారం టెక్స్‌టైల్ పార్కు స్థితిగతులపై పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితో పాటు టెక్స్‌టైల్ పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.
2012లో కేటాయింపులు జరిగినా..
2012లో పాశమైలారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.13.37 కోట్ల వ్యయంతో పార్కును అభివృధ్ది చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు మౌళిక సౌకర్యాల కల్పనకు రూ.9.22 కోట్లు వెచ్చించారు. మొత్తం 80 ప్లాట్లుగా విభజించి 42 మందికి 67 ప్లాట్లు కేటాయించారు. మరో 21 ప్లాట్లు కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్లాట్లు పొందిన వాటిలో 15 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి ప్రారంభించినా..ప్రస్తుతం 7 మాత్రమే పనిచేస్తున్నాయి.
కోట్లు వెచ్చించినా పార్కు స్థాపన ద్వారా ఆశించిన స్థాయిలో ఉపాధి లభించడం లేదు. పారిశ్రామిక వాడలో సౌకర్యాల లేమి కూడా పెట్టుబడిదారులను నిరుత్సాహ పరుస్తున్నాయి. పార్కు చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో నిర్మాణ సామగ్రి, ముడిసరుకు, యంత్రాలకు రక్షణ లేకుండా పోయింది. టెక్స్‌టైల్ పరిశ్రమలు కాకుండా ఇతర పరిశ్రమలు కూడా ఏర్పాటైనట్లు ఫిర్యాదులున్నాయి.
డైయింగ్ తదితరాల ద్వారా వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఈటీపీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. మరోవైపు యూనిట్ల నిర్మాణం పూర్తి కాకముందే పన్ను చెల్లించాలంటూ ఐలా (పారిశ్రామిక వాడల స్థానిక అభివృద్ధి సంస్థ) నోటీసులు జారీ చేస్తోంది. ఉత్పత్తి ప్రారంభం కాకముందే పన్నుల వసూలుపై పెట్టుబడిదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.