సీఎం కేసీఆర్‌కు కంటి ఆపరేషన్ పూర్తి | Cm KCR Cataract procedure on the right eye completed successfully | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు కంటి ఆపరేషన్ పూర్తి

Published Wed, Sep 6 2017 12:56 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

సీఎం కేసీఆర్‌కు కంటి ఆపరేషన్ పూర్తి - Sakshi

సీఎం కేసీఆర్‌కు కంటి ఆపరేషన్ పూర్తి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బుధవారం డాక్టర్‌ సచ్‌దేవ్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం కంటి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని సీఎం తనయుడు ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ‘గౌరవ ముఖ్యమంత్రి కుడి కన్నులోని కాట్రాక్ట్‌ ఆపరేషన్‌ విజయవంతమైంది. డాక్టర్‌ సచ్‌దేవ్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు.
 
ఈ ఆపరేషన్‌ కోసం సీఎం గత శుక్రవారం( సెప్టెంబర్‌ 1న) ఢిల్లీకి వెళ్లారు. శనివారం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇదే సమయంలో వైద్యులు ఆపరేషన్‌కు కావల్సిన చికిత్సలు పూర్తి చేశారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement