స్వశక్తి మహిళలకు ‘బతుకమ్మ’ చీరలు
మంత్రి కేటీఆర్ చొరవతో సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో 61 లక్షల మందికి సిరిసిల్ల చీరలు
సిరిసిల్ల నేతన్నలకు రూ.105 కోట్ల ఆర్డర్లు
పరిశీలించిన జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్
సిరిసిల్ల: రాష్ట్రంలోని స్వశక్తి సంఘాల మహిళ లకు ప్రభుత్వం చీరలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఆడపడు చులకు అతిపెద్ద పండుగగా భావించే వచ్చే బతుకమ్మ పండుగకు కానుకగా స్వశక్తి సంఘాల్లోని మహిళలందరికీ ప్రభుత్వం ఉచి తంగా చీరలు అందించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పవర్‌లూమ్స్‌పై ఉత్పత్తి అయ్యే చీరలను పంపిణీ చేయాలని భావిస్తోంది. సిరిసిల్ల నేత న్నలకు నిరంతరం ఉపాధి కల్పించడంతో పాటు మహిళలకు బతుకమ్మ కానుకగా చీర లు అందించాలని యోచిస్తోంది. చీరల పంపి ణీకి ఇప్పటికే సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నేతన్నలకు శాశ్వత ఉపాధిని దృష్టిలో ఉంచుకుని బతు కమ్మ పండుగ ఆర్డర్లు ఇవ్వాలని భావిస్తున్నా రు. దీంతో సిరిసిల్ల నేత కార్మికులకు రూ.105 కోట్ల విలువైన వస్త్రం కొనుగోలు ఆర్డర్లును ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మూడున్నర కోట్ల మీటర్ల చీరలు..
రాష్ట్రంలోని 31 జిల్లాలో 4 లక్షలకుపైగా స్వశక్తి సంఘాలు ఉండగా 61 లక్షల మంది మహిళ లు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణలోని 61 లక్షల మంది మహిళలకు చీరలు అందించేం దుకు మూడున్నర కోట్ల మీటర్ల వస్త్రం అవ సరమని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న చీరలను రాష్ట్ర చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజారామ య్యర్ మూడు రోజుల కిందట పరిశీలించి వెళ్లారు. సిరిసిల్లలో సాంచాలపై ఉత్పత్తి అవు తున్న చీరలు నాణ్యమైనవిగా ఉండడంతో మహిళలకు పంపిణీ చేసేందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడుకు సరఫరా అయ్యేవాటిS కంటే నాణ్యమైన, మెరుగైన డిజైన్లతో చీరలను ఇవ్వాలని భావిస్తున్నారు.
సిరిసిల్ల నేతన్నలకు చేతి నిండా పని..
ప్రభుత్వ ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు లభిస్తే.. సంక్షోభంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు మంచి రోజులు వస్తాయి. నేత కార్మికుల చేతికి నిరం తరం పని ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర పరి శ్రమ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు చొరవతో రాజీవ్ విద్యామిషన్ ద్వారా స్కూల్ యూనిఫాం వస్త్రం ఆర్డర్లు సిరిసిల్లకు లభించాయి. క్రిస్మస్ వేడుకలకు కొత్త బట్టలు అందించే ఆర్డర్లను సైతం ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకే ఇచ్చింది. ఇప్పుడు తాజాగా బతుకమ్మ పండుగకు స్వశక్తి సంఘాలకు ఉచితంగా చీరలు అందించే ఆర్డర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు రూ.105 కోట్ల చీరలను ఆర్డర్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో చౌకధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం చీరలను ప్రజలకు అం దించాలనే ప్రతిపాదనను సిద్ధం చేశారు. టీడీపీ హాయాంలో జనతా వస్త్రాలు పంపిణీ చేసిన విధంగా రేషన్ కార్డులపైనే తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల చీరలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒకరోజు సిరిసిల్ల వస్త్రం ధరించాలని, మున్సిపల్, సింగరేణి, వైద్యశాలలకు సైతం సిరిసిల్ల వస్త్రాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.
చాలా ప్రతిపాదనలున్నాయి
సిరిసిల్ల నేత కార్మికు లకు ఉపాధి కల్పించేందుకు చాలా ప్రతి పాదనలు ఉన్నాయి. రాష్ట్రంలోని స్వశక్తి సంఘం మహిళల కు బతుకమ్మ పండుగకు చీరలు అందించేందుకు ప్రభుత్వం పరిశీలి స్తుంది. జౌళిశాఖ కమిషనర్ ఇటీవలే సిరిసిల్లకు వచ్చి వెళ్లారు. ఇక నేత కార్మికులు చేతి నిండా లభించేలా ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తుంది.
– అశోక్‌రావు.ఏడీ.రాజన్న సిరిసిల్ల జిల్లా
చేతి నిండా పని ఉంటుంది..
సిరిసిల్లలో ఐదేళ్లుగా పనిచేస్తున్నా. ప్రభుత్వ ఆర్డర్లు వస్తే మాకు చేతి నిండా పని ఉంటుంది. రో జూ 12 గంటలు సాం చాల మధ్య పని చేస్తే వారానికి రూ.2500 వస్తున్నాయి. కొంచెం కూలి పెంచి పని కల్పించాలి.
– బాసబత్తిని కేదారి, నేత కార్మికుడు