
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(సోమవారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం ప్రగతి భవన్ నుంచి బయలుదేరి నేరుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకుంటారు. అక్కడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ఉత్తర తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.