సీఎం రాకతో పనులు వేగవంతం
•వచ్చే ఏడాది మార్చికి విద్యుత్ ఉత్పత్తి
•పనులపై మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, రామన్న సమీక్ష
జైపూర్ : మండల కేంద్ర సమీపంలో సింగరే ణి సంస్థ నిర్మిస్తున్న 1200 మె గా వాట్ల విద్యు త్ ప్రాజెక్టు నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ డిసెంబర్ 25న సమీక్ష జరపడంతోనే పనులు మరింత వేగవంతమయ్యాయని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యుత్ ప్రాజెక్టులోని అతిథి గృహంలో మంత్రులు, ప్రభుత్వ విప్ ఓదెలు, కలెక్టర్ జగన్మోహన్‌లకు సింగరేణి డెరైక్టర్ (ఆపరేషన్స్) రమేష్‌కుమార్, విద్యుత్ ప్రాజెక్టు ఈడీ సంజయ్‌కుమార్ సూర్, అధికారులు బీవోపీ, బీటీజీ నిర్మాణ పనుల వివరాలు తెలిపారు. సీఎం కేసీఆర్ రాక ముందు, వచ్చిన అనంతరం జరిగిన పనుల ప్రగతి నివే దికలను పరిశీలించారు. శ్రీరాంపూర్ ఓసీపీ నుంచి జైపూర్ విద్యుత్ ప్రాజెక్టుకు రైల్వేట్రాక్ ఏర్పాటు, షెట్‌పల్లి గోదావరి నది నుంచి నీటిని తరలించడానికి పైపులైన్ ఏర్పాటుకు కావాల్సిన భూము లు, తదితర అంశాలను సింగరేణి అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రాజెక్టు నిర్మాణ పనులపై సుమారు గంటకుపై మంత్రులు సమీక్ష జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రు లు మాట్లాడారు. 20 నుంచి 25 శాతం అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. పవర్ ప్లాంటు పూర్తయితే రాష్ట్రంలో కొంతమేర కరెంటు కొరత తీరుతుందన్నారు. అధికారులు ఇలాగే పనులు కొనసాగించాలని సూచిం చారు. వచ్చే ఏడాది మార్చికి విద్యుత్ ఉత్పత్తి చేయాలని సూచించారు. 1200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అనంతరం మరో 600 మెగా వాట్ల ప్లాంటు పనులు ప్రారంభమవుతాయన్నారు. సమావేశంలో ప్లాంటు జీఎం సుధాకర్‌రెడ్డి, ఆర్డీవో మస్రత్ ఆయేషా ఖానం, జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీ మెండ హేమలత, జెడ్పీటీసీలు జర్పుల రాజ్‌కుమార్ నాయక్, సుదర్శన్‌గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.