రెబ్బెన : కోల్‌యార్డు నుంచి వెలువడే దుమ్ము, ధూళిని అరికట్టంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సింగరేణి అధికారులను హెచ్చరించారు. మండల కేంద్రమైన రెబ్బెన సమీపంలో సింగరేణి యూజమాన్యం లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న రైల్వే స్లైడింగ్ పారుుంట్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. బొగ్గు డంపింగ్, లోడింగ్ సమయాల్లో వెలువడే దుమ్ము, ధూళిని అరికట్టేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని తహశీల్దార్ జగదీశ్వరీని ఆదేశించారు.
సోమవారంలోగా దుమ్ము, ధూళి బయటకు వెళ్లకుండా తెరలను ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న దేవులగూడ ప్రజలు, రైతులు రైల్వేస్లైడింగ్ వల్ల ఏర్పడుతున్న సమస్యలను సబ్‌కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దుమ్ము, ధూళి కారణంగా పంటలు దెబ్బతింటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమీప ఇళ్లలోని పిల్లలు శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారని తెలిపారు. అరగంటకోసారి రోడ్డు వెంట నీళ్లు చల్లాల్సి ఉండగా రోజులో రెండు మూడుసార్లు మాత్రమే చల్లుతున్నారని తెలిపారు. బొగ్గు లోడింగ్, అన్‌లోడింగ్ సమయాల్లో దుమ్ము లేవకుండా నీటిని చల్లాల్సి ఉండగా అలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. 15 రోజుల్లో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ఎస్‌వోటూ జీఎం వెంకటేశ్వరరావు, డీజీఎం అశోక్ కుమార్ సబ్ కలెక్టర్‌కు తెలిపారు. ఆర్‌ఐ బక్కయ్య, రైతు శ్రీనివాస్ ఉన్నారు.
హద్దులు ఏర్పాటు చేయండి
రెబ్బెనను అనుకుని ఉన్న ఎల్లమ్మ చెరువులో ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వే చేసి కచ్చితమైన శిఖం భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేయూలని సబ్‌కలెక్టర్ తహశీల్దార్‌ను ఆదేశించారు. మిషన్ కాకతీయలో భాగంగా ఎల్లమ్మ చెరువు మంజూరు కాగా శుక్రవారం పరిశీలించారు.
కోల్‌యార్డు దుమ్ము, ధూళిని అరికట్టాలి
Published Sat, Mar 14 2015 3:18 AM | Last Updated on Mon, Apr 8 2019 6:46 PM
Advertisement
Advertisement