వరంగల్, జనగామ బల్దియా అధికారులకు కూడా...
హన్మకొండ అర్బన్ : జిల్లాలో పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలన సకాలంలో పూర్తిచేయని తహసీల్దార్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశీలన పూర్తికాని 14మండలాల తహసీల్దార్లతోపాటు వరంగల్ మునిసిపాలిటీ అడిషనల్ కమిషనర్, జనగామ మునిసిపల్ కమిషనర్‌కు మెమోలు జారీచేశారు. రెండు రోజుల్లో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
మెమోలు జారీ అరుున వారిలో వరంగల్ మునిసిపల్ అడిషనల్ కమిషనర్ శంకర్, జనగామ మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణ, తహసీల్దార్లు ప్రకాష్‌రావు (దేవరుప్పుల), నర్సయ్య (నర్మెట), జయమ్మ (రఘునాథపల్లి), విజయ్‌కుమార్ (ఆత్మకూరు), కుమారస్వామి (గీసుకొండ), రాంమూర్తి (స్టే.ఘన్‌పూర్), చెన్నయ్య (హన్మకొండ), రాజమహేందర్‌రెడ్డి (హసన్‌పర్తి), ఉమారాణి (సంగెం), కిరణ్‌ప్రకాష్ (వర్ధన్నపేట), రాంప్రసాద్ (గూడూరు), పూల్‌సింగ్ (కొత్తగూడ), కనకరాజు(గణపు రం), సత్యనారాయణ (ములుగు) ఉన్నారు.
‘దేవాదుల’ పైపులైన్ లీకేజీ
ములుగు : ములుగు మండలం జాకారం, వెంకటాపురం మండలం ఇంచెన్ చెర్వుపల్లి గ్రామాల మధ్య ఉన్న దేవాదుల రెండో దశ పైపులైను గురువారం సాయంత్రం ఐదు గంటలకు లీకేజీ అయింది. దీంతో నీరు పక్కనే ఉన్న డీబీఎం 38 కెనాల్ కాలువ, చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి వచ్చి చేరుతోంది. విషయం తెలుసుకున్న దేవాదుల సూపర్‌వైజర్ రమేష్ సాయంత్రం 7 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
కాగా, తమ పొలాలకు నీటి కోసం సమీప రైతులు లీకేజీ చేశారా ప్రవాహాన్ని తట్టుకోలేక జరిగిందా అనే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైపులైను పక్కనే ఉన్న డీబీఎం 38 కెనాల్ నేరుగా మండలంలోని లోకం చెరువుకు అనుసంధానం అయి ఉండడం వల్ల కొందరు కావాలని పైపులైన్‌ను లీక్ చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లోకం చెరువు కింద రబీ సాగుకు రైతులు పెద్దసంఖ్యలో సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు లీకేజీని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు సూపర్‌వైజర్ రమేష్ తెలిపారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నర్మెట : తీవ్ర వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి పెట్టుబడులకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక వరంగల్ జిల్లా నర్మెట మండలం కేంద్రం ఆగాపేటకు చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన నూనె ఓదేల్(50) తనకున్న రెండెకరాలతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మూడెకరాల్లో పత్తి, ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేశాడు.
గత సంవత్సరంలో కూడా పంటలు సరిగా పండలేదు. దీంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు కుప్పలుగా పేరుకుపోయూరుు. సుమారు రూ.4లక్షల మేరకు అప్పులయ్యాయి. ఈ క్రమంలో మనసాపానికి గురైన ఓదేల్ గురువారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనం ద్వారా జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
14 మంది తహసీల్దార్లకు కలెక్టర్ మెమోలు
Published Fri, Nov 7 2014 3:03 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement