అవి.. హ్యాపీడేస్ | College days To remember Actor Allari Naresh | Sakshi
Sakshi News home page

అవి.. హ్యాపీడేస్

Published Fri, Feb 27 2015 11:53 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

అవి.. హ్యాపీడేస్ - Sakshi

అవి.. హ్యాపీడేస్

- ఉత్సాహంగా ‘టాలెంటైన్-2015 టెక్నోఫెస్ట్’
- కాలేజీ రోజులను గుర్తు చేసుకున్న సినీనటుడు అల్లరి నరేష్

మొయినాబాద్: ప్రతి ఒక్కరి జీవితంలో కాలేజీ రోజులు ఎంతో మధురమైనవని ప్రముఖ సినీ నటుడు అల్లరి నరేష్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ‘టాలెంటైన్-2015 టెక్నోఫెస్ట్’ శుక్రవారం మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అల్లరి నరేష్ విద్యార్థులను చూసి తన కళాశాల రోజులను గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ .. విద్యార్థి దశలో చిలిపి చేష్టలు చేయడం సహజమే అయినప్పటికీ భవిష్యత్‌కు బాటలు వేసేది సైతం ఇదే దశ అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. ప్రముఖ గాయని లిప్సిక పాడిన పాటలు విద్యార్థులచే ఉత్సాహంగా కేరింతలు కొట్టించాయి. విద్యార్థుల సాంస్కృతిక  ప్రదర్శనలు అలరించాయి.

ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం అనాథ విద్యార్థులకు అల్లరి నరేష్ చేతులమీదుగా బ్యాగులు పంపిణీ చేసింది. క్రీడాపోటీలు, సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కార్గో కంపెనీ డెరైక్టర్ కమల్‌జైన్, ఒలింపియన్ విజేత పవన్, కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ మధుసూదన్‌నాయర్, అధ్యాపకులు సౌజన్య, ప్రసన్న, ఏఓ రవికిరణ్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ మురళీకృష్ణ, కోఆర్డినేటర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement