- వారం కిందటే ఏర్పాట్లు.. ఇప్పటికీ జారీ కాని వైనం
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు (పీఈసెట్)పై గందరగోళం నెలకొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 23న నోటిఫికేషన్ జారీ చేసి, 24 నుంచి దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 15 నుంచి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టును నిర్వహించాల్సి ఉంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో అంతర్గంగా నెలకొన్న సమస్యల కారణంగా నోటిఫికేషన్ జారీ నిలిచిపోయింది. దీంతో వేల మంది విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
అసలేం జరిగిందంటే...
యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ తనకు పీఈసెట్ కన్వీనర్ బాధ్యతలు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఎస్‌ఎంఎస్ పంపించి, ఒక రోజంతా కనపడ కుండాపోవడంతో యూనివర్సిటీలో ఆందోళ నకర పరిస్థితి నెలకొంది. దీంతో 23న జారీ చేయాల్సిన నోటిఫికేషన్‌ను అధికారులు నిలిపివేశారు. ఆ తరువాత ఆయన తిరిగి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకు న్నారు. ఇది జరిగి వారం గడిచి పోయింది. అయినా ఇంతవరకు నోటిఫి కేషన్‌ను జారీ చేయలేదు. కాగా, ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ ఆలస్యం అవుతుండటం, దరఖాస్తుల స్వీకరణ తేదీలు కూడా మారిపోయినందున ఇక వచ్చే నెలలోనే దరఖాస్తులను స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు చెబుతున్నారు. మే 15 నుంచి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు నిర్వహణ సాధ్యం కాదని, మే 25 నుంచి నిర్వహించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
పీఈసెట్ నోటిఫికేషన్ ఎప్పుడు?
Published Thu, Mar 30 2017 5:30 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM
Advertisement