రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణం: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని తెలంగాణ ఐటీశాఖామంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ మూడు పేజిల బహిరంగ లేఖ రాశారు.
హంతకుడే సంతాప సభ పెట్టిన విధంగా కాంగ్రెస్ నేతల తీరు ఉందని ఆయన అన్నారు. సీమాంధ్రకు అక్రమంగా నీరు ఇచ్చిన చరిత్ర మాజీ మంత్రి డీకే అరుణదేనని కేటీఆర్ విమర్శించారు.