కేసీఆర్ ను విమర్శిస్తే సూరీడుపై ఉమ్మేసినట్లే | deputy cm rajaiah blames congress leaders | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ను విమర్శిస్తే సూరీడుపై ఉమ్మేసినట్లే

Published Fri, Oct 17 2014 7:47 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కేసీఆర్ ను విమర్శిస్తే సూరీడుపై ఉమ్మేసినట్లే - Sakshi

కేసీఆర్ ను విమర్శిస్తే సూరీడుపై ఉమ్మేసినట్లే

కరీంనగర్: విద్యుత్ సమస్యల పరిష్కారంలో కేసీఆర్ సర్కారు విఫలమైందన్న తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం రాజయ్య ఖండించారు. అసలు విద్యుత్ కష్టాలు రావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణమైతే.. కేసీఆర్ ను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అర్ధంలేని వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నేతలకు తగదని సూచించారు.  అసలు కేసీఆర్ పై లేనిపోని వ్యాఖ్యలు చేస్తే ఆ సూరీడుపై ఉమ్మేసినట్లేనని రాజయ్య తెలిపారు. రైతుల ఆత్మహత్యల గురించి పదేళ్లుగా మాట్లాడని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ధర్నాలకు దిగడం అర్ధరహితమన్నారు.
 

కేసీఆర్ చేసిన మోసానికి రైతుల ఆత్మహత్యలే నిదర్శనమని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించిన సంగతి తెలిసిందే. తాము రైతులకు భరోసా ఇచ్చి ఆందోళన చేపట్టామని, ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ వైఫల్యం కారణమని, విద్యుత్ సమస్య పరిష్కరించి రైతుల ఆత్మహత్యలు అరికట్టేవరకు కాంగ్రెస్ కార్యకర్తలు నీ గుండెల్లో నిద్రపోతారని కేసీఆర్ను పొన్నాల హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement