'కేసీఆర్.. నీ గుండెల్లో నిద్రపోతాం' | telangana congress leaders challenge kcr over farmer suicides | Sakshi
Sakshi News home page

'కేసీఆర్.. నీ గుండెల్లో నిద్రపోతాం'

Published Fri, Oct 17 2014 3:04 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'కేసీఆర్.. నీ గుండెల్లో నిద్రపోతాం' - Sakshi

'కేసీఆర్.. నీ గుండెల్లో నిద్రపోతాం'

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నిమిషాల్లోనే ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ అంశాలపై సంతకం చేశారని, కేసీఆర్ మాత్రం ప్రమాణస్వీకారం చేసిన ఆరు వారాల తర్వాత రుణమాఫీపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కరీంనగర్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న రైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ చేసిన మోసానికి నిదర్శనమని ఆయన అన్నారు.

తాము రైతులకు భరోసా ఇచ్చి ఆందోళన చేపట్టామని, ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ వైఫల్యం కారణమని, విద్యుత్ సమస్య పరిష్కరించి రైతుల ఆత్మహత్యలు అరికట్టేవరకు కాంగ్రెస్ కార్యకర్తలు నీ గుండెల్లో నిద్రపోతారని కేసీఆర్ను పొన్నాల హెచ్చరించారు. ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ వచ్చాక ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement