ఆ విషయంలో చాలా హర్ట్‌ అయ్యా : జగ్గారెడ్డి | Congress leaders not with me when i am in jail says Jaggareddy | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో చాలా హర్ట్‌ అయ్యా : జగ్గారెడ్డి

Published Mon, Feb 4 2019 3:12 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Congress leaders not with me when i am in jail says Jaggareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తాను జైలులో ఉన్నపుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న హేమా హేమీ నాయకులు చూడడానికి కూడా రాలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తనకు అండగా నిలిచారని తెలిపారు. వీహెచ్ తప్ప మరెవరు తనను వచ్చి పరామర్శించలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను చాలా హర్ట్‌ అయ్యానన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో లాబీయిస్టులదే నడుస్తోందని జగ్గారెడ్డి తెలిపారు. ఇప్పుడు పదవులు వచ్చిన వారికి అలాగే వచ్చాయన్నారు. ఇప్పటికైనా లాబీయింగ్‌లకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ 7 నుండి 8ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపారు. సీనియర్ నాయకులు ఎంపీ బరిలో ఉంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement