సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్) కేటాయింపుల విషయంలో సీఎం కేసీఆర్ వివక్ష చూపుతు న్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిం చారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కోమటిరెడ్డి బుధవారం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సచివాలయానికి సీఎం రారని, ప్రగతిభవన్‌కు వెళ్తే అపాయింట్‌మెంట్ దొరకదని విమర్శించారు. పేదలు వైద్యం చేసుకుంటే అన్ని ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాయని, ఇప్పుడు సీఎం కేసీఆర్ సీఎంఆర్‌ఎఫ్ మంజూరీలోనూ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పెద్ద స్కామ్ అని కోమటిరెడ్డి ఆరోపించారు.
సీఎంఆర్‌ఎఫ్ కేటాయింపులలో వివక్ష
Published Thu, Jun 22 2017 4:00 AM | Last Updated on Mon, Oct 29 2018 8:31 PM
Advertisement
Advertisement