కల్వకుర్తిపై ఎందుకు స్పందించరు..?
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై శాస్త్రీయత లోపించిందని ఎమ్మెల్యే అన్నారు. జనగామ, గద్వాల, సిరిసిల్ల జిల్లాలపై స్పందించిన సీఎం కేసీఆర్ కల్వకుర్తి రెవెన్యూ డివిజన్పై ఎందుకు స్పందించడం లేదని..? ఆయన ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలపై ప్రభుత్వం, కేసీఆర్ స్పందించరా ..అని వంశీచంద్రెడ్డి నిలదీశారు.