జగిత్యాల నియోజకవర్గం... పూర్తి స్థాయిలో వ్యవసాయాధారిత ప్రాంతం. రాష్ట్రంలోనే నాణ్యమైన పంటలు తీస్తున్న జగిత్యాల అన్నింటా ముందంజలో సాగుతోంది. జిల్లాగా ఏర్పడిన తరవాత అభివృద్ధి మరింత వేగమైంది. అయితే ఇక్కడి ప్రజలు ఏళ్ల కాలంగా కాంగ్రెస్‌నే ఆదరించటం విశేషం. 1952లో జరిగిన తొలి శాసన సభ ఎన్నికల్లో ఎస్‌సీఎఫ్ పార్టీ నుంచి డి.రాజారాం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఒకసారి గెలుపొందిన వారిని ఇక్కడి ప్రజలు మరోసారి ఆదరించలేదు. అయితే 1983లో టీడీపీ నుంచి బరిలో దిగిన తాటిపత్రి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి రమణ రెండుసార్లు శాసనసభకు వెళ్లారు. ఈ సారి అభివృద్ధి మంత్రంతో టీఆర్‌ఎస్... అనుభవం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టిపోటీ నెలకొనుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
చరిత్ర చూస్తే...
జగిత్యాల నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఎస్‌సీఎఫ్ పార్టీ తరపున రాజారాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. రాజయ్యపై విజయం సాధించారు. 1952లో (ద్విసభ్యనియోజకవర్గం) నుంచి పీడీఎఫ్ పార్టీ నుంచి బి. మల్లారెడ్డి స్వాతంత్ర్య అభ్యర్థి కె. సేవరాజం పై గెలుపోందారు. 1957లో కాంగ్రెస్ నుంచి డి.హన్మంతరావు పీఎస్‌పీఅభ్యర్థి ఎస్‌ఆర్. లింగాల పై గెలిచారు.1962లో స్వత్వంత్ర అభ్యర్థి ఎం.ధర్మారావు కాంగ్రెస్ అభ్యర్థి డి. హన్మంతరావును ఓడించారు. 1963 ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌అభ్యర్థి కె. లక్ష్మీనర్సింహారావు స్వతంత్ర అభ్యర్థి ఎస్. రెడ్డిపై గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి కె.లక్ష్మీనరసింహారావు ఏకగ్రీవం అయ్యారు. 1972లో కాంగ్రెస్అభ్యర్థి వి. జగపతిరావు స్వతంత్ర అభ్యర్థి ఎస్‌ఆర్ .రావుపై విజయం సాధించారు.
1978లో కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ రావు జనతా పార్టీ అభ్యర్థి జె. దామోదర్‌రావును ఓడించారు. 1983లో టీడీపీఅభ్యర్థిగా తాటిపర్తి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెఆర్. రావుపై విజయం సాధించారు. 1985లో టీడీపీ అభ్యర్థిగా జి.రాజేశం గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఓడించారు. 1989లో కాంగ్రెస్ అభ‍్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి రాజేశంగౌడ్‌పై గెలుపొందారు. 1994లో టీడీపీఅభ్యర్థి ఎల్.రమణ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్‌రెడ్డిపై గెలుపొందారు. 1996 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టి. జీవన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి బండారి వేణుగోపాల్‌పై విజయంసాధించారు. 1999,2004లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి ఎల్.రమణపై విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2009లో టీడీపీ అభ్యర్థిఎల్.రమణ కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్‌రెడ్డిపై విజయం సాధించారు.2014లో మళ్లీ టి.జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్‌పై విజయం సాధించారు.
10 సార్లు కాంగ్రెస్ ... టీడీపీ నాలుగున సార్లు ...
వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన జగిత్యాలకు ఎంతో చారిత్రాత్మాక పేరుంది.మొదటి నుంచి కాంగ్రెస్ ప్రాబల్యం నియోజకవర్గంపై అధికంగా ఉంది.నియోజకవర్గం 17 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 10 సార్లు ,టీడీపీ నాలుగుసార్లు విజయం సాధించాయి.అలాగే పీడీఎఫ్ ,ఎస్‌సీఎఫ్ ,ఇండిపెండెంట్ అభ్యర్థులుఒక్కోసారి విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గస్థానాల్లో 12 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసంచేసుకుంటే జగిత్యాలలో మాత్రం 'హస్తం 'హవా కొనసాగింది.
ఆరుసార్లు జీవన్ .. రెండుసార్లు రమణ
కాంగ్రెస్ పార్టీ కీలకనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి జగిత్యాల నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు పోటీచేశారు. ఆరుసార్లు గెలుపొందారు. ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణనాలుగుసార్లు పోటీచేయగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ,ఒకసారి ఎంపీగా గెలుపొందారు.జీవన్‌రెడ్డి ఎక్సైజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పని చేశారు. రమణకార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ ద్విముఖ పోటీ ఉండేది. 2014లో తొలిసారిటీఆర్‌ఎస్ జగిత్యాల నియోజకవర్గంలో తమ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్‌కుమార్‌ను బరిలో దింపింది. దీంతో మొదటిసారి త్రిముఖ పోటీ ఏర్పడింది. 2018 ఎన్నికల్లోమహాకూటమితో ఎల్.రమణ ,జీవన్‌రెడ్డిలు ఒకటికావడంతో సంజయ్‌కుమార్‌కు మద్దతుగా ఎంపీ కవిత తన గెలుపు బాధ్యతలు తీసుకున్నారు.
మహిళ ఓటర్లే కీలకం
జగిత్యాల అర్భన్ మండలంలో మహిళా ఓటర్లు 37,611 ఉంటే ...పురుషలు 37,010 మంది ఉన్నారు. రూరల్‌లో మహిళా ఓట్లు 23,420 ఉన్నాయి.సారంగాపూర్‌లో స్త్రీలు 9,160 ,పురుషులు 8360 మంది ఉన్నారు.బీజపూర్‌లో స్త్రీలు 7,644, పురుషులు 7010 మంది ఉన్నారు. మొత్తంగా పురుషులకంటేఆరువేలు పైబడే మహిళా ఓట్లు ఉన్నాయి. గతంలో ఈ ఆరువేల తేడాతో ఓడిన అభ్యర్థులు ఉన్నారు.
జగిత్యాల స్వరూపం ...
జగిత్యాల వ్యవసాయ ఆధారిత నియోజకవర్గంగా పేరుగాంచింది.వరి ,మొక్కజొన్న,పసుపు పండిస్తారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందింది. జగిత్యాల నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది.ఇందులో కొడిమాల్య ,మల్యాల,జగిత్యాల పట్టణం , జగిత్యాల మండలాలు ఉండేవి. 2009 లో నియోజకవర్గాలపునర్విభజనలో జగిత్యాల, రాయ్‌కల్ ,సారంగాపూర్ మండలాలతో ఏర్పాటైంది. 2016లో 18 మండలాలతో జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించింది. బీజాపూర్ ,జగిత్యాల అర్బన్ మండలాలలు ఏర్పాటు అయ్యాయి. జగిత్యాల దేశవ్యాప్తగుర్తింపు పొందిన జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం ,పొలాస వ్యవసాయ పరిశోధన క్షేత్రం ఉన్నాయి.
బరిలో వీరే ..
జగిత్యాలలో ఈ సారి టీఆర్‌ఎస్ -కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు రమణ మహాకూటమి తరుఫు కోరుట్లనుంచి పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నియోజకవార్గంలో పట్టున్న అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి బరిలో దిగనున్నారు. టీఆర్‌ఎస్ నుంచినియోజకవర్గం ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ పేరు ప్రకటించారు. ఈ సారి ఎలాగైనా జగిత్యాలలో గులాబీ జెండా ఎగురవేయాలని ఎంపీ కవిత పావులుకదుపుతున్నారు. ఇక బీజేపీ నుంచి ముదుగంటి రవీందర్‌రెడ్డి టికెట్‌కోసం ప్రయత్నిస్తున్నారు. పలువురు నాయకులు వివిధ పార్టీల నుంచి టికెట్‌కోసంవిశ్వప్రయత్నలు చేస్తున్నారు.
జగిత్యాల నియోజకవర్గ ఓటర్లు ..
పురుషులు | 94,347 |
స్త్రీలు | 1,00,051 |
ఇతరులు | 15 |
మొత్తం | 1,94,413 |
Comments
Please login to add a commentAdd a comment