నామా పీఏపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి | Congress party supporters attacks on Nama Nageswara Rao's personal assistant | Sakshi
Sakshi News home page

నామా పీఏపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి

Published Wed, Apr 30 2014 2:56 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress party supporters attacks on Nama Nageswara Rao's personal assistant

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాకు వచ్చిన ఎంపీ నామా నాగేశ్వరరావును స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఆయన పీఏ కొండలరావుపై దాడి చేశారు. ఆ ఘటనతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు. నామా పీఏపై దాడికి దిగనవారిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

 

అలాగే ఆదిలాబాద్ జిల్లా మామంద మండలం నల్దుర్తిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. పోలీసులపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement