ఫలితాలపై నేడు కాంగ్రెస్‌ సమీక్ష | Congress party will review the Lok Sabha polls Saturday | Sakshi
Sakshi News home page

ఫలితాలపై నేడు కాంగ్రెస్‌ సమీక్ష

Published Sat, May 25 2019 2:28 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Congress party will review the Lok Sabha polls Saturday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ పార్టీ శనివారం సమీక్షించనుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగే ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీ అభ్యర్థులు ఈ భేటీలో పాల్గొననున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు, రాబోయే జిల్లా పరిషత్‌ ఎన్నికలు, స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement