
బాత్‌రూంలో జారిపడిన ‘కాకా’
కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి(కాకా) ప్రమాదవశాత్తు బాత్‌రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన కుడికాలు విరిగిపోయింది. ఈ సంఘటన సోమవారం జరిగింది.
విరిగిన కుడికాలు, ఆస్పత్రికి తరలింపు
శంకర్‌పల్లి, కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి(కాకా) ప్రమాదవశాత్తు బాత్‌రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన కుడికాలు విరిగిపోయింది. ఈ సంఘటన సోమవారం జరిగింది. జి.వెంకటస్వామి రోజు మాదిరిగానే ఉదయం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహరాజ్‌పేట్ గ్రామ శివారులోని తన ఫాంహౌస్‌కు వచ్చారు. సాయంత్రం 4:30 గంటల సమయంలో గదిలో ఉన్న బాత్‌రూంకు వెళ్లిన ఆయన కాలు జారి కిందపడ్డారు. ప్రమాదంలో వెంకటస్వామి కుడికాలు మోకాలి పైభాగంలో ఎముక విరిగిపోయింది. 108లో కేర్ ఆస్పత్రికి తరలించారు.