‘ఓటు’పై చైతన్యం కలిపిస్తున్న వైద్యుడు | A Conscious Physician On 'Vote' At Siddipet | Sakshi
Sakshi News home page

‘ఓటు’పై చైతన్యం కలిపిస్తున్న వైద్యుడు

Published Mon, Nov 26 2018 2:54 PM | Last Updated on Mon, Nov 26 2018 2:57 PM

A Conscious Physician On 'Vote' At Siddipet - Sakshi

వైద్యుడు మందులు రాసిచ్చే చీటి (ప్రిస్కిప్షన్‌)

సిద్దిపేటకమాన్‌: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచడానికి సిద్దిపేట ఐఎంఏ వైద్యుడు డా.సతీశ్‌ తన వంతుగా వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి, ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చైతన్యపరుస్తున్నారు.

చికిత్స కోసం వచ్చే వారికి మందులు రాసిచ్చే చీటి (ప్రిస్కిప్షన్‌) పైన ‘‘ఓటరుగా గర్విద్దాం.. ఓటు హక్కును వినియోగిద్దాం’’ అనే కోటేషన్‌ రాసి ఉన్న స్టిక్కర్‌ అతికించి రోగులకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు


గతంలో సైతం వయోజనులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఐఎంఎ తరపున పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్థానికుల నుంచి అభినందలను అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మందుల చిటీపైన  ఉన్న కొటేషన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement