సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: గాంధీ ఆస్పత్రిలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కరోనా బాధితుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ అతడి బంధువులు డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లపై దాడికి దిగారు. కిటికీ అద్ధాలు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపైనా దాడి చేశారు. అతడు బాత్‌రూమ్‌లో జారి పడటం వల్లే మృతిచెందాడని తాము చెప్పినప్పటికీ వారు వినకుండా దాడికి దిగారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మృతుడితోపాటు దాడి చేసిన వారికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిసింది. అనంతరం దాడికి దిగిన వారిని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి తరలించారు.
అసలేమైందంటే?:
మర్కజ్ నుంచి వచ్చిన హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి (56)ని కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో చికిత్స కోసం వారం రోజుల క్రితం గాంధీ ఆస్పత్రి ఐసీ యూ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతడితోపాటు సోదరుడు సహా మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆస్పత్రిలో చేరారు. వీరందకీ వైద్యులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ తేలింది. మొదట చేరిన వ్యక్తి (56) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం గా ఉంది. దీంతో వైద్యులు ఎప్పటి కప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అతడి బంధువులకు వివరిస్తూనే ఉన్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల సమ యంలో బాధితుడు ఒక్కరే ఐసోలేషన్ వార్డులోని బాత్‌రూమ్‌కు వెళ్లాడు. ప్రమా దవశాత్తు కాలు జారి కిందపడి మృతి చెందారు. డ్యూటీలో ఉన్న వైద్యులు ఇదే అంశాన్ని అక్కడే ఉన్న మృతుడి సోదరు డు, ఇతర బంధువులకు వివరించారు. వారు ఇదేమీ పట్టించుకోకుండా వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాధితుడు చనిపోయాడని ఆగ్రహించారు. విధి నిర్వహణలో ఉన్న రెసిడెంట్ డాక్టర్ వేణు, డాక్టర్ వికాస్‌లపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారు. ఐసోలేషన్ వార్డులోని కిటికి అద్దాలు ధ్వంసం చేశారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ను చెల్లాచెదురు చేశారు.
ఔట్ పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చినా..
ఇదే సమయంలో మరికొంత మంది వైద్యులు ఆస్పత్రి ఔట్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారమి చ్చారు. కరోనా బాధితులున్న ఐసోలేషన్ వార్డులోకి వచ్చేందుకు తమకు అనుమతి లేదని చెప్పి, వారు అక్కడికి వచ్చేందుకు నిరాకరించారు. ఆస్పత్రి సూపరింటెండెం ట్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే డీఎంఈకి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సీపీ అంజన్‌కుమార్ వెంటనే గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి కూడా కరోనా పాజిటివ్ ఉండటంతో ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆస్పత్రిలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
భయాందోళనలో వైద్య సిబ్బంది
ఐసోలేషన్ వార్డులో వైద్యులపై రోగి త రఫు బంధువులు దాడికి దిగటంతో ఐసీ యూ, ఐసోలేషన్ వార్డుల్లో విధులు ని ర్వహిస్తున్న స్టాఫ్ నర్సులు, ఇతర సి బ్బం ది భయంతో పరుగులు తీశారు. కొం తసేపు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర అయోమయానికి గురయ్యారు. తోటి రో గులు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది.
దాడులకు దిగితే సహించం: డీజీపీ
వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవా రం గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనా రోగులు చేసిన దాడిని ఆయన ఖండించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై దాడులకు దిగితే ఉపేక్షించబోమన్నారు. కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు. ఈ మేరకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.
దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు
ఆస్పత్రుల్లో విధులు నిర్వహి స్తున్న సిబ్బందిపై దాడులకు పాల్ప డితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ బోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. వైద్యులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టంచేశారు. వైద్యులకు ప్రభుత్వం అన్ని విధా లుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో దాడి ఘటన నేపథ్యంలో ఆ ఆస్పత్రి సె క్యూరిటీ ఇన్‌చార్జిగా అదనపు డీసీపీ ఏ.భాస్కర్‌ను నియమిస్తూ నగర పో లీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశా రు. ఈయనకు నార్త్‌జోన్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సహకరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment