కేతేపల్లి మండలం చెర్కుపల్లిలో థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న వైద్య సిబ్బంది
యాదాద్రి భువనగిరి, కేతేపల్లి (నకిరేకల్) : మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు గురువారం కరోనా పాజిటివ్ నిర్ధారణయ్యింది. మండల వైద్యాధికారి విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 50సంవత్సరాలు గల ఓ మహిళ భర్త అనారోగ్యం బారిన పడటంతో చికిత్స కోసం పది రోజుల కిత్రం సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వివిధ పరీక్షలు చేసిన అనంతరం కిడ్నీ సంబంధిత వ్యాధిగా గుర్తించిన వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని కామినేని అస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తికి తోడుగా అతడి భార్య కూడా ఆస్పత్రికి వెళ్లింది. రెండు రోజుల కిత్రం భర్తకు తోడుగా వెళ్లిన భార్యకు తీవ్ర జ్వరం లక్షణాలు కనిపించటంతో అనుమానం వచ్చిన ఆస్పత్రి వైద్యులు కరోనా వైరస్ టెస్టు కోసం శాంపిల్స్‌ను గాంధీ ఆస్పత్రికి పంపించారు. సదరు మహిళకు కరోనా పాజిటివ్ ఉందని రిపోర్టు రావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.
చెర్కుపల్లిలో అధికారుల పర్యటన..
కోవిడ్ భారిన మహిళ స్వగ్రామమైన చెర్కుపల్లిలో తహసీల్దారు డి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐ బి.రామక్రిష్ణ, మండల వైద్యాధికారి విజయ్‌కుమార్, సీహెచ్‌ఓ సుందర్‌నాయక్, బి.శ్యాంసుందర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ బొస్క ప్రసాద్ గురువారం గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలి దగ్గరి బంధువులను, సమీప నివాసగృహాల వారికి సంబంధించి 19మందిని గుర్తించిన అధికారులు స్క్రీనింగ్ పరీక్షలు చేసి హోంక్వారంటైన్ చేసినట్లు అధికారులు తెలిపారు. సదరు మహిళ ద్వారా గ్రామంలో ఇంకా ఎంత మందికి కరోనా వైరస్ సోకిందోనని గ్రామస్తులు అందోళన చెందుతున్నారు.
ఏడుగురికీ నెగెటివ్
మునుగోడు : గత నెల 29న కరోనాతో మృతి చెందిన మండలంలోని సింగారం గ్రామానికి చెందిన మహిళను కలిసిన ఏడుగురికి జిల్లా వైద్య అధికారులు కరోనా పరీక్షలు చేయగా వారికి నెగెటివ్ వచ్చినట్లు డిప్యూటీ డీహెంఎచ్‌ఓ కె.కళ్యాణచక్రవర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు ఇప్పటి వరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు నెగెటివ్ రావడంతో వారిని ఇంటికి పంపిచారు.
అందరికీ నెగెటివ్
నల్లగొండ టౌన్ : జిల్లా నుంచి కరోనా పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారందరి నమూనాలను కరోనా పరీక్షలకు పంపించగా అందరికి నెగెటివ్ వచ్చినట్లు జిల్లా సర్వేలెన్స్ అధికారి డా.రాహుల్ గురువారం తెలిపారు. కరోనాతో ఉస్మానియా ఆస్పత్రిలో మృతి చెందిన మహిళతో కాంటాక్టయిన వారితో పాటు జిల్లా కేంద్రంలోని పానగల్ బ్రిడ్జి సమీపంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్టయిన వారికి అదేవిధంగా జిల్లా ఆస్పత్రిలో అనుమానిత 24 మంది వ్య క్తుల నుంచి సేకరించిన నమూనాలను బుధవా రం పరీక్షల కోసం పంపించామన్నారు. ఈ పరీక్షల్లో వారందరికీ నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు.
గుట్ట’ పోలీస్‌స్టేషన్‌లో పని చేసే కానిస్టేబుల్‌కు కరోనా..
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణ పో లీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే ఓ కాని స్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. రామంతపూర్ శ్రీనివాసపురం కాలనీకి చెందిన ఓ కానిస్టే్టబుల్ యాదగిరిగుట్ట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 29న అనారోగ్యంగా కనిపించా డని, దీంతో పోలీస్ అధికారులు విధులకు రాకుండా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకో వాలని సూచించారు. ఈ నెల 3న జ్వరం మ ళ్లీ రావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి లో పరీక్షలు చేసుకోవడంతో గురువారం క రోనా పాజిటివ్ వచ్చిందని అక్కడి వైద్యులు తెలిపారని స్థానిక పోలీస్ సిబ్బంది చర్చించుకున్నారు. ఈ విషయమై పట్టణ సీఐ పాండురంగారెడ్డి నిజమేనని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment