
సరిహద్దుల్లోనే వారికి శరీర ఉష్ణోగ్రత పరీక్షలు చేసి క్వారంటైన్ స్టాంపులు వేసి వారు వెళ్తున్న గ్రామాల వైద్య సిబ్బందికి సమాచారం అందిస్తున్నామన్నారు
సాక్షి, హైదరాబాద్: వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వలస కూలీలు తిరిగి వస్తుండటంతో రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలోకి వస్తున్న ప్రతి ఒక్కరిపై దృష్టి పెట్టామన్నారు. సరిహద్దుల్లోనే వారికి శరీర ఉష్ణోగ్రత పరీక్షలు చేసి క్వారంటైన్ స్టాంపులు వేసి వారు వెళ్తున్న గ్రామాల వైద్య సిబ్బందికి సమాచారం అందిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలిందన్నారు. రాష్ట్రంలోకి వస్తున్న ప్రతి ఒక్కరినీ 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచుతామన్నారు. కరోనా వచ్చిన వలస కూలీల్లో 8 మంది యాదాద్రి భువనగిరి జిల్లా, ముగ్గురు మంచిర్యాల జిల్లాకు చెందినవారని ఆయన తెలిపారు.
(చదవండి: బర్త్‌డేలో సూపర్ స్ప్రెడ్!)