చంద్రబాబుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం | Court order for registration of a case against Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

Published Tue, May 5 2015 2:58 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

Court order for registration of a case against Chandrababu

కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు స్వీకరణ

రంగారెడ్డి జిల్లా కోర్టులు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్య లు చేశారంటూ దాఖలైన ఫిర్యాదు మేరకు ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేయాలంటూ సైబరాబాద్ 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సోమవారం చైతన్యపురి పోలీసులను ఆదేశించారు. ఫిర్యాదుదారుడు సుంకరి జనార్దన్‌గౌడ్ కథనం ప్రకా రం... ఏపీలోని రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ లేకపోతే కేసీఆర్ సిద్దిపేటలో గొర్రెలు, పశువులు మేపుకునేవారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించార ని, గొర్రెలు కాచుకునేవాడంటూ ఓ కులవృత్తిని అవమానపరిచారని జనార్దన్‌గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఈ నెల 30లోగా నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement