వెల్దుర్తి: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం దొంగచాటుగా భూమిని సేకరిస్తూ నిర్వాసితులను మోసం చేస్తోందని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేషం ఆరోపించారు. నిర్వాసితుల తరఫున ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం వెల్దుర్తి మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన బాధిత రైతులతో మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీ సర్కార్ మాత్రం 123 జీవో ప్రకారం భూములు సేకరించి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఈ నెల 20 న మెదక్ ఆర్‌డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
భూ నిర్వాసితుల కోసం సీపీఎం పాదయాత్ర
Published Tue, May 17 2016 3:50 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement