సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఇతర రాష్ట్రాలకు సీఎం కేసీఆర్ సూచనలు చేస్తున్నారని వివరించారు. లాక్‌డౌన్ దృష్ట్యా నిరుపేదలకు ప్రభుత్వం సాయం అందిస్తోందని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ వెళ్లొచ్చినవారేనని వెల్లడించారు. అధిక కేసులు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. వలస కూలీల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
(కోవిడ్-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్‌కు కేంద్రం ఆమోదం)
పేదలకు అదనంగా 12 కిలోల ఉచిత బియ్యంతో పాటు రూ.1500 చొప్పున నగదను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ హెచ్చరించారు. ప్రసుత్తం కరోనాను కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని.. ఆ తర్వాతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. మొబైల్ రైతు బజార్లతో కూరగాయలు డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నట్లు సీఎస్ సోమేష్‌కుమార్ పేర్కొన్నారు.
(కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)
Comments
Please login to add a commentAdd a comment