సాక్షి, కామారెడ్డి: రైతులకు దగ్గరుండి బ్యాంకులో రుణాలిప్పించాడు. తర్వాత రుణాలు చెల్లించడానికి అని చెప్పి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఎగనామం పెట్టాడో ఉపసర్పంచ్. ఈ ఘటన నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయ డైరీ నిర్వాహకుడుగా పని చేస్తున్న ఉప సర్పంచ్ ఖదీర్ పాడి రైతులు గేదెలు కొనుగోలు చేయటానికి రుణాలను ఇప్పించాడు. అనంతరం బాకీ తీర్చడం కోసం రైతుల దగ్గర సుమారు రూ.35 లక్షలు వసూలు చేశాడు. కానీ బ్యాంకుకు కట్టలేదు. తీరా రుణం చెల్లించలేదని రైతులకు బ్యాంకు నోటీసులు జారీ చేయటంతో మోసం బయటపడింది. తమకు న్యాయం చేయాలంటూ పాడి రైతులు గురువారం గ్రామ పంచాయతీ ముందు ఆందోళన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment