కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తిలో ఇటీవల ఏర్పాటుచేసిన వనసంరక్షణ సమితి కమిటీలో దళిత మహిళలకు స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ దళితులు భారీ సంఖ్యలో సోమవారం ఉదయం బస్టాండు కూడలిలో ఆందోళనకు దిగారు.
కమిటీలో ఇద్దరు దళిత మహిళలకు చోటు కల్పించాలని నిబంధనలు చెబుతుండగా ఒక్కరికే కల్పించారని వారు పేర్కొన్నారు. తనకు న్యాయం జరిగేవరకు ఆందోళనను విరమించేదిలేదని వారు తేల్చి చెప్పారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి నచ్చజెప్పినా ప్రయోజనం లేదు. ఆందోళన ఇంకా కొనసాగుతోంది.
ఎల్కతుర్తిలో దళితుల ధర్నా
Published Mon, Feb 1 2016 1:13 PM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM
Advertisement
Advertisement