శనివారం ప్రగతి భవన్ ఆవరణలోని దుర్గామాత ఆలయంలో పూజలు చేస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా శనివారం ప్రగతి భవన్ ఆవరణలో ఉన్న దుర్గామాత ఆలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయుధ పూజ అనంతరం వాహన పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి శోభ, కుమారుడు కె.తారకరామారావు, కోడలు, మనవడు, మనవరాలు పాల్గొన్నారు.
సీఎంను కలసిన ప్రముఖులు..
దసరా సందర్భంగా శనివారం సీఎం కేసీఆర్‌ను పలువురు కలసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ సలీం, ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, వివేకానంద, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ తదితరులు వీరిలో ఉన్నారు.