హన్మకొండ : ఎన్పీడీసీఎల్‌లో కలకలం రేపిన కేబుల్ కుంభకోణంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ప్రాథమిక విచారణ పూర్తి కాగా... కేబుల్ వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నలుగురు కన్‌స్ట్రక్షన్ డీఈలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యూరుు. అంతేకాకుండా... కేబుల్ కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, ఇతర డిస్కంల కంటే ఎక్కువ ధర పెట్టారంటూ అప్పటి పర్చేసింగ్ విభాగం సీఈ, ఎస్‌ఈ, డీఈ, ఏడీఈలకు నోటీసులు ఇచ్చారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని రిస్ట్రక్టడ్ అక్యులరేటేడ్ పవర్ డెవలప్‌మెంట్ అండ్ రీఫామ్స్ ప్రోగ్రాం (ఆర్‌ఏపీడీఆర్‌పీ) పథకంలో విద్యుత్ సరఫరాకు కొత్త లైన్ల ఏర్పాటు నిమిత్తం కేబుల్ కొనుగోలు చేశారు. 2010, 2011, 2012 ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు చేసిన 11 కేవీ కేబుల్‌లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి.
కేబుల్‌ను బిగించిన వెంటనే కాలిపోవడంతో నాణ్యత లేదనే విషయం వెల్లడైంది. ఈ మేరకు గత ఏడాది జూలైలో ఈ విషయూన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా ప్రాథమిక విచారణకు ఆదేశాలిచ్చారు. ఆపరేషన్స్ విభాగం సీజీఎం యూనస్‌ను విచారణాధికారిగా నియమించారు. వారం రోజులపాటు సాగిన విచారణలో ఆయన కేబుల్ టెండర్లు, ఒప్పందాలు, నిబంధలన్నీ పరిశీలించారు. కేబుల్ వినియోగించిన సమయం లో సర్టిఫై చేసిన అధికారుల నుంచి వివరణ తీసుకోవడంతోపాటు అప్పటి రిపోర్టును స్వాధీనం చేసుకున్నారు.
కేబుల్‌తోపాటు ఏబీ స్విచ్‌లు, కాసారాలు, ఇన్సులేటర్లు, హెచ్‌జీ ఫ్లగ్‌లు, కటవుట్స్ మొత్తం నాసిరకమేనని విచారణలో వెల్లడైంది. సాంకేతిక కారణాలను సైతం ఆయన ఎత్తిచూపారు. సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడమూ కారణమని, ఎర్తింగ్ అనువుగా ఇవ్వకపోవడంతో కేబుల్ ఫెయిలైనట్లు తేల్చారు. కేబుల్ కొనుగోళ్లలో పర్చేసింగ్ విభాగం నిర్లక్ష్యం వహించడమే కాకుండా, కొనుగోలు సమయంలో 180 కి.మీల కేబుల్‌కు రూ. 60 లక్షల ఎక్కువ ధర పెట్టినట్లు విచారణలో బహిర్గతమైంది. ఈ వ్యవహా రంలో ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి పర్చేసింగ్ డెరైక్టర్ రాజేశ్వర్‌రావు రాజీ నామా చేశారు. ప్రస్తుతం ప్రాథమిక విచారణ పూర్తి కాగా.. ఈ వ్యవహారంలో సం బంధమున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
పక్కదారి పట్టించేందుకేనా...
ప్రాథమిక విచారణ ఏనాడో పూర్తి అయినప్పటికీ... ఒత్తిళ్లతో ఫైల్‌ను తొక్కిపెట్టినట్లు ఎన్పీడీసీఎల్‌లో ప్రచారం జరుగుతోంది. కొంతమంది డీఈ లను ఉద్దేశపూర్వకంగా తప్పించడంతోపాటు పూర్తిస్థారుు విచారణను పక్కదారి పట్టించే కుట్ర అని గుసగుసలు వినిపిస్తున్నారుు. ప్రస్తుతం ఎన్పీడీసీఎల్ ఫైనాన్స్ డెరైక్టర్ సుదర్శన్ పూర్తిస్థారుు విచారణ చేపట్టారు. ఇందులో అసలు విషయాలు బయటకు రాకుండా షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు.
కేబుల్ కుంభకోణంలో కదలిక
Published Wed, Jul 16 2014 2:15 AM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
Advertisement