జిల్లా విద్యాశాఖాధికారు(డీఈఓ)ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సాక్షి, హైదరాబాద్: జిల్లా విద్యాశాఖాధికారు(డీఈఓ)ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాఠశాల విద్యాశాఖ పంపించిన ప్రతిపాదనలను సీఎం కార్యాలయం గురువారం ఆమోదించినట్లు తెలిసింది. త్వరలో పలు జిల్లాల్లో పనిచేస్తున్న డీఈఓలు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వరంగల్ డీఈఓ విజయ్ కుమార్ ఎస్‌సీఈఆర్‌టీకి, మహబూబ్‌నగర్ డీఈఓ చంద్రమోహన్ వరంగల్‌కు, ఐటీడీఏ భద్రాచలం డీఈఓ రాజేష్ మహబూబ్‌నగర్‌కు బదిలీ కానున్నారని తెలిసింది. అదేవిధంగా వీరితోపాటు ఇంకొంతమంది డీఈఓలు, హైదరాబాద్ ప్రాంతీయ జాయింట్ డెరైక్టర్ (ఆర్‌జేడీ)లను బదిలీచేస్తూ త్వరలో పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుందని సమాచారం.