అలసత్వాన్ని, అవినీతిని కానీ ఉపేక్షించేది లేదు..
ఈ సందర్బంగా మిషన్ భగీరథ పనులు ఎక్కడివరకు వచ్చాయి, ప్రజలకు ఎప్పటిలోపల మంచినీటిని అందజేయగలం అనే విషయంపై చర్చించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, నగర మేయర్ నరేందర్, శాసన సభ్యులు దయాకర్ రావు, ప్రభుత్వ విప్ వెంకటేశ్వర్లు, ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, రెడ్యా నాయక్, రాజయ్య, వినయ్ భాస్కర్, ఎంపీలు సీతారాం నాయక్, దయాకర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పద్మ, ‘కుడా’ చైర్మన్ యాదవరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.