
భక్తులను దొడ్డి దారిన దర్శనానికి పంపుతున్న అధికారులు
యాదగిరీశుడి సన్నిధికి నిత్యం 10నుంచి 15వేల మంది భక్తులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఆ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. వీరందరూ స్వామివారిని దర్శించుకోవాలంటే టికెట్ తీసుకుని గంటల తరబడి క్యూలైన్లలో బారులుదీరాల్సిందే.. కానీ, కొందరు ఎంచక్కా దొడ్డిదారిన బాలాలయంలోకి వెళ్తున్నారు.
దేవస్థానం అధికారుల్లో కొందరు.. టికెట్ లేకుండానే తమ పరిచయస్తులు, బంధువులను వెనుకడోరు నుంచి నేరుగా అనుమతిస్తున్నారు. వీరిని నిమిషాల పాటు ఆలయం లోపల కూర్చోబెట్టి హారతులిస్తుండడంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. అంతేకాకుండా దేవస్థానం ఆదాయానికి గండిపడడంతో పాటు ఆలయ భద్రతకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి నిత్యం కొన్ని వేల మంది వస్తుంటారు. సెలవు రోజుల్లో ఆ సంఖ్య రెట్టింపు అవుతుంది. స్వామి అమ్మవార్ల దర్శనానికి టికెట్ తీసుకుని ఎంతోశ్రమకోర్చి పిల్లాపాపలతో గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుంటారు. కానీ ఆలయ అధికారులు కొందరు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తమకు పరిచయమున్న వారిని, బంధువులను దొడ్డిదారిన దర్శనానికి తీసుకెళ్తున్నారు.
వీరిని నిమిషాల కాలం లోపల కూర్చోబెట్టి హారతులు, అర్చనలు సాగిస్తున్నారు. దీంతో దేవస్థానం ఆ దాయానికి గండిపడడంతో పాటు ఆల య భద్రతకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఈ దారి .. నిర్మా ణం జరుగుతున్న ప్రధానాలయంలోని స్వామి స్వయంభూ మూర్తుల ఆలయంలో నిత్య కైంకర్యాలను జరపడానికి ఆల య అర్చకులు వెళ్లడానికి ఏర్పాటు చేసిం ది. కానీ ఈ దారి అర్చకులతో పాటు వీఐపీల దారిగా మారింది.
ఇక ఇప్పుడు ఆలయ అధికారులు తమకుపరిచయస్తులు, బంధువులను తీసుకుని వచ్చి ఏకంగా వాహనాలు అక్కడేఆపి దర్శనాలను కొనసాగిస్తున్నారు. ప్రధానాలయం విస్తరణ జరుపుతున్న ఈ తరుణంలో అక్కడ ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు గాను కెమెరాలను అమర్చారు. కానీ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ భద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా ఆలయ అధికారులు దొడ్డి దారిన దర్శనాలకు అనుమతివ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఆలయ అధికారుల కనుసన్నలలోనే జరుగుతోంది.
అక్కడి నుంచి దర్శనాలకు పంపించడంలేదు
మేము అక్కడి నుంచి దర్శనాలకు పంపిం చడం లేదు. అక్కడ ఈ మధ్య రోడ్డు ప్ర మాదం జరిగిందని మూసి వేశాం. ఎ వరైనా క్యూలైన్లలో నుంచే రావల్సిందే.
– దోర్భల భాస్కర శర్మ, యాదాద్రి ఆలయ ఏఈవో
మా ఇష్టం...
మా ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటాం. మాకు ఎవ్వరూ ఏమీ చెప్పాల్సిన పనిలేదు. అన్నీ మాకు తెలుసు. మా సంబంధీకులు ఎవరూ రావడం లేదు. – మల్లేష్ , ఆలయ సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment