అఖిలపక్ష భేటీలో టీఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు వ్యవహా రంపై చర్చ కొనసాగించాలని అఖిలపక్ష భేటీలో కేంద్రాన్ని కోరినట్టు టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమా వేశాల నేపథ్యంలో సోమవారం ఇక్కడ జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ 9 రోజుల్లో అన్నింటిపై చర్చకు ఆస్కారం లేదు. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం వంటి అంశాలకు 5 రోజులు పూర్తవు తాయి. ఇక మిగిలిన రోజుల్లో అనేక బిల్లు లు రానున్నా నోట్లరద్దుపై చర్చ జర గాలని కోరాను. రెండో విడత సమా వేశాల్లో హైకోర్టు విభజన, ఎయి మ్స్ ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టులు, వెనుక బడిన జిల్లాలకు, మిషన్ కాకతీయ, భగీ రథ పథకాల నిధుల గురించి ప్రస్తావిస్తామని వెల్లడించారు.
నోట్ల రద్దుపై చర్చ కొనసాగాలి
Published Tue, Jan 31 2017 1:53 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
Advertisement
Advertisement