భూ పంపిణీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేసిందని, దాన్ని అమలు చేయడంతో మాత్రం చిత్తశుద్ధి కొరవడిం దని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. శుక్రవారం హై దరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో దళితులు, భూమిలేని పేదలకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10 నుంచి చేపట్టను న్న ర్యాలీ, ధర్నాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ పెద్దల కంపెనీలకు ఇవ్వడానికే భూమి సరిపోక పాయే.. ఇక పేదలకు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
అనేక భూసంస్కరణలు తీసుకొచ్చినా పేదలకు భూ మి లభించలేదన్నారు. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటున్నామ ని ప్రభుత్వం చెబుతోందని... ఎంత స్వాధీనం చేసుకుందో ఎవరికీ తెలియదన్నారు. రైతుల జీవన స్థితి గతులను పెంచేందుకు వారికి ఎరువులు, విత్తనాలు, నీళ్లు ఉచితం గా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ, ప్రజాకళా మండలి ప్రధా న కార్యదర్శి కోటి, టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.