హన్మకొండ అర్బన్ : జిల్లాలో కలెక్టర్, జేసీ, కమిషనర్ల బదిలీ అయి సరిగ్గా పది రోజలు పూర్తి కాకముందే... వారి తర్వాత స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులు ఒకే సారి బదిలీ బాటపట్టారు. జిల్లాలో ఏజేసీ, డీఆర్వో, డీఆర్‌డీఏ పీడీ, డ్వామా డీపీ, ఎస్‌ఎస్‌ఏ పీఓ, దళిత అభివృద్ధి శాఖ డీడీ, ఎస్సారెస్పీ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతాయని ఊహాగానాలు వస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో స్థానచలనం కావడం విశేషం. ప్రస్తుతం జిల్లాకు వస్తున్న వారిలో ఏజేసీ, ఎస్‌ఎస్‌ఏ పీఓ, కంతనపల్లి ప్రత్యేక కలెక్టర్, దళిత సంక్షేమ శాఖ డీడీ జిల్లాలో గతంలో పనిచేసిన వారే.
ఏజేసీగా వినయ్‌కృష్ణారెడ్డి
జిల్లాకు ఏజేసీగా వినయ్‌కృష్ణారెడ్డి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం ఆర్డీఓగా పనిచేస్తున్నారు. గతంలో వినయ్‌కృష్ణారెడ్డి జిల్లాలో జనగామ ఆర్డీఓగా, డ్వామా పీడీగా, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీగా నాలుగేళ్లపాటు పనిచేశారు. ప్రస్తుత కలెక్టర్ కరుణ జేసీగా ఉన్న సమయంలో ఆయన జనగామ ఆర్డీఓగా పనిచేశారు. జిల్లానుంచి ప్రస్తుతం బదిలీ అయిన ఏజేసీ కృష్ణారెడ్డికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
డీఆర్వోగా శోభ
జిల్లా రెవెన్యూ అధికారిగా కె .శోభ వస్తున్నారు. ఆమె ప్రస్తుతం కరీంనగర్ ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా(ఎఫ్‌ఎస్‌ఓ) పనిచేస్తున్నారు. జిల్లానుంచి బదిలీ అయిన సురేంద్రకరణ్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
డ్వామా పీడీగా రవినాయక్
నల్లగొండ జిల్లా దేవరకొండ ఆర్డీఓగా పనిచేస్తున్న రవినాయక్‌ను జిల్లాలో డ్వామా పీడీగా బదిలీ చేశారు. ప్రస్తుతం జిల్లా నుంచి బదిలీ అయిన డ్వామా పీడీ వి.వెంకటేశ్వర్లుకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
డీఆర్‌డీఏ పీడీగా వెంకటేశ్వర్‌రెడ్డి
ఎక్సైజ్ శాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న వెంకటేశ్వర్‌రెడ్డి డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో డీఆర్‌డీఏ పీడీ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్‌చార్జిగా ఏపీడీ రాము కొనసాగుతున్నారు.
దళిత సంక్షేమ శాఖ డీడీగా కృష్ణవేణి
జిల్లా దళిత సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలుగా కృష్ణవేణి పోస్టింగ్ పొం దారు. ప్రస్తుతం ఆమె జిల్లాలోనే ఎఫ్‌ఎస్‌ఓగా పనిచేస్తూ దళిత సంక్షేమ శాఖ డీడీగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రసుతం ఆమెకే పూర్తి బాధ్యతలు ఇచ్చారు. ఇంతకాలం డీడీగా ఉన్న రోశన్నకు పోస్టింగ్ ఇవ్వలేదు.
ఎస్‌ఎస్‌ఏ పీఓగా సర్వే సంగీత
సర్వశిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు డెరైక్టర్‌గా సర్వే సంగీత వస్తున్నారు. ప్రస్తుతం సంగీత హెచ్‌ఎండీఏలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు.ప్రస్తుత కలెక్టర్ కరుణ జేసీగా ఉన్న సమయంలో సంగీత వరంగల్ ఆర్డీఓగా రెండున్నరేళ్లు విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం పీఓగా ఉన్న రాజమౌళికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రాజమౌళి రెండురోజుల క్రితమే విధుల్లో చేరారు.
కంతనపల్లి ప్రాజెక్టుకు డేవిడ్
ప్రస్తుతం జిల్లాలో ఎస్సారెస్పీ ఎస్‌డీసీగా ఉన్న ఎం.డేవిడ్‌ను జిల్లాలోని కంతనల్లి ప్రాజెక్టు భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌గా బదిలీచేశారు. ఎస్సారెస్పీకి ఇంకా ఎవ్వరిని ఇవ్వలేదు.
జిల్లా అధికారుల బదిలీ
Published Fri, Jan 30 2015 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement