తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. ఎమ్మెల్యేలు కోరిన చోటకు అధికారులను బదిలీ చేసేందుకు కేసీఆర్ అంగీకరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారుల బదిలీ అంశాలన్నికేసీఆర్ ఎదుట ప్రస్తావించారు.
తెలంగాణ భవన్లో శుక్రవారం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని నియోజవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. నియోజకవర్గ అభివృద్ధికి 1.5 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు కేసీఆర్ అంగీకరించారు.