మావోళ్లు ఎట్లున్నరో! | Districts people are also affected on Nepal earthquake | Sakshi
Sakshi News home page

మావోళ్లు ఎట్లున్నరో!

Published Tue, Apr 28 2015 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

Districts people are also affected on Nepal earthquake

 - నేపాల్‌లో చిక్కుకున్న 2వేల మంది?
 - బుడగజంగాలవారే అత్యధికం
 - పనిచేయని సమాచార వ్యవస్థ
 - క్షేమ సమాచారం తెలియక బంధువుల ఆందోళన
.

నేపాల్ భూకంపం జిల్లాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో నష్టం చేస్తున్న భూవిలయంలో జిల్లావాసులు రెండువేల మంది చిక్కుకున్నారని అంచనా. వీరిలో చాలామంది బుడగజంగాల వారే. రంగురాళ్లు, ఉంగరాల విక్రయం, జాతకాలు చెప్పేందుకు వలసవెళ్లిన వీరి సమాచారం తెలియక వారి కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

ఫోన్లలో సమాచారం కోసం ప్రయత్నిస్తున్నా స్పందించకపోవడం... అక్కడ చాలా మంది మరణించినట్లు, గాయపడినట్లు వార్తలు వస్తుండడంతో తమవారి కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, నారాయణరావుపల్లి, గొల్లపల్లి, కరీంనగర్ మండలం చేగుర్తి, తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీ, వీణవంక మండలం చల్లూరు తదితర గ్రామాల నుంచి రెండు వేల మంది ఉపాధికోసం నేపాల్ వెళ్లారు. ఒక్క రామకృష్ణకాలనీవారే వెరుు్యమందికి పైగా ఉంటారని తెలిసింది.

సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, నారాయణరావుపల్లి గ్రామాలకు చెందిన 300 మంది బుడగజంగాల కులస్తులు ఇలా వెళ్లారు. కఠ్మాండు, పశుపతి క్షేత్రం ఏరియా, పూనభువనేశ్వర ప్రాంతం, భీంసింగ్ కోలా ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరంతా 6 నెలలకోసారి స్వగ్రామానికి వచ్చి వెళ్తుంటారు. చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు మాత్రమే స్వగ్రామాల్లో ఉంటున్నారు. శనివారం భూకంపం వార్త వినగానే క్షేమ సమాచారం కోసం ఫోన్ చేయగా అక్కడివారి ఫోన్‌లు పనిచేయక వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

విషయూన్ని స్థానిక సర్పంచ్ పడాల అజయ్‌గౌడ్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌తో ఫోన్‌లో మాట్లాడించి కలెక్టర్ నీతూప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి వారి సమాచారం కోసం భారత రాయబార కార్యాలయం ద్వారా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి వారిని స్వగ్రామానికి చేర్చేలా ప్రయత్నం చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. పెద్దపల్లి ఆర్డీవో నారాయణరెడ్డి గర్రెపల్లికి చేరుకుని వారి ఇంటి పేరు, వయసు తదితర వివరాలు సేకరించి కలెక్టర్‌కు సమచారం పంపించారు.
మేమంతా క్షేమం

వేములవాడ అర్బన్ : అనుపురం గ్రామానికి చెందిన సుమారు 60 మంది బుడగజంగాల కుటుంబీకులు నేపాల్‌లో ఉంటారు. వీరిలో 50మంది భూకంపం సంభవించిన ప్రాంతంలోనే ఉన్నారు. అక్కడ భూకంపం వచ్చిందన్న సమాచారంతో తమవారి క్షేమసమాచారం తెలుసుకునేందుకు కుటుంబసభ్యులు టీవీలకే అతుక్కుపోయూరు. రామారి మల్లవ్వ కుమారుడు నగేశ్ సిక్కింలో ఉండగా ఇంటికి ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని తెలిపాడు. తిండికి తిప్పలవుతోందని పలువురు చెబుతున్నారని, నేపాల్ నుంచి తమను రైళ్లు, హెలిక్యాప్టర్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని వీర్నాల లక్ష్మణ్, గంగారాం, వీర్నాల రమేశ్ ఆదివారం మధ్యాహ్నం సమాచారం అందించారని గ్రామ మాజీ సర్పంచ్ ఎర్రం రాజు తెలిపారు. ఫోన్లు సరిగా పనిచేయడం లేదని, సోమవారం తిరిగి ఫోన్ చేస్తామని, తమ గురించి ఆందోళనలు చెందవద్దని చెప్పారన్నారు.

రామకృష్ణకాలనీలో ఆందోళన
తిమ్మాపూర్ :
నేపాల్ భూకంపం మండలంలోని రామకృష్ణకాలనీ బుడగ జంగాల కులస్తులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాలనీకి చెందిన వెరుు్య మంది రంగురాళ్లు, ఉంగరాలు అమ్ముకునేందుకు, జాతకాలు చెప్పేందుకు నేపాల్ వెళ్తుంటారు. కఠ్మాండు సమీపంలో పురాణాభానేశ్వర్, సినా మంగల్‌లో ఉంటారు. శని, ఆదివారాలు అక్కడే భూకంపం వచ్చినట్లు తెలియడంతో తమవారి క్షేమ సమాచారం తెలియక పిల్లలు, పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కొందరు తమ యోగ క్షేమాలను ఫోన్లలో కుటుంబీకులకు చేరవేస్తున్నారు. గంధం తిరుపతి తలకు గాయాలైనట్లు, ఆసుపత్రిలో ఉన్న అంజూ ఫోన్ చేయడం లేదని, బూతం తిరుపతి, లక్ష్మీ ఫోన్‌లో మాట్లాడడం లేదని వారివారి కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు. సుమారు 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు
వీణవంక : వీణవంక మండలం చల్లూరు శివారు గొల్లపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం. గొల్లపల్లిలోని బుడిగజంగాల కాలనీకి చెందిన పస్తం సమ్మయ్య, భార్య లక్ష్మి, కుమారులు శ్రీనివాస్, స్వామి, ప్రదీప్, కూతురు భాగ్య ఆరు నెలల క్రితం కఠ్మాండు వెళ్లారు. వీరంతా భూకంపంలో చిక్కుకున్నారని, జాడ తెలియడం లేదని, ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని సమ్మయ్య తమ్ముడు యూదగిరి కన్నీటి పర్యంతమయ్యూడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖాన్‌పూర్ ప్రాంతంలో సంభవించిన భూకంపంలో వీణవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన 8 మంది చిక్కుకున్నారు.

గందం రాజారం, అతడి భార్య శారద, కుమారుడు రమేశ్, కోడలు తిరుమల, మనుమరాలు సుశ్మిత ఖాన్‌పూర్‌లో ఉంగరాలు అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నారు. శనివారం భూకంపంతో గోడ కూలి రాజారం, సుశ్మిత గాయపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని ఫోన్‌లోనే విలపించాడు. ఇదే గ్రామానికి చెందిన కల్లేం బాలయ్య, అతడి భార్య, కుమారుడు గంగారం సైతం ఖాన్‌పూర్‌లో చిక్కుకున్నారు. రామడుగు మండలం గోపాల్‌రావుపేట మండలానికి కిన్నెర రాజలింగు, అతడి భార్య సమ్మక్క, వెనుగొండ రాజయ్య నేపాల్‌లోని పశుపతి ఆలయం దగ్గర చిక్కుకున్నట్లు సమాచారం అందించారని, వీరుంటున్న ఇళ్లు కూలిపోయూయని ఇప్పుడు ఎలా? ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని  కుటుంబసభ్యులు వాపోయూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement