పాలమూరు : సుప్రీంకోర్టు ఆదేశానుసారం వినాయకచవితికి డీజేలు అనుమతించబోమని మహబూబ్‌నగర్ డీఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించుకునే నిర్వాహకులు, ఆర్గనైజేషన్లు విధిగా వారి సమాచారాన్ని స్థానికంగా ఉన్న పోలీసులకు అందించాలని, ప్రతి వీధికి ఒక ఇన్‌చార్జి పోలీసు అధికారులను నియమించి బందోబస్తు నిర్వహించి వారికి రక్షణ కల్పిస్తామన్నారు.
చెరువుల్లో నీళ్లు తక్కువగా ఉన్నాయని, మట్టి వినాయకులను పెట్టుకోవాలని సూచించారు. ఎత్తయిన విగ్రహాలు ప్రతిష్టించడంవల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, చిన్నవిగ్రహాలను ప్రతిష్టించుకోవాలన్నారు. సీఐలను, ఎస్‌ఐలు ప్రతి కాలనీకి ఒకరిని ఇన్‌చార్జిగా నియమించామని తెలిపారు. బలవంతపు చందాలు వసూలు చేస్తే చట్టరీత్య కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బలవంతంగా చందాలు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేస్తే చందా వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో శాంతి కమిటీ సమావేశాలు, ఆర్గనైజర్ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అందరు ఒకేరోజు వినాయక నిమజ్ఞనం చేయాలని, అందుకు నిర్వాహకులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐలు సీతయ్య, జ్యోతిలక్ష్మి పాల్గొన్నారు.
వినాయకచవితికి డీజేలకు అనుమతి లేదు
Published Fri, Aug 28 2015 1:06 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement