
'కేటీఆర్ ఆంధ్రాలో చదువుకున్నారు'
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ మాదిరిగా తనకు ఆంధ్రా వాసనలు లేవని డీకే అరుణ అన్నారు. కేటీఆర్... ఎన్టీఆర్ పేరు పెట్టుకుని, ఆంధ్రాలో చదువుకున్నారని తెలిపారు. తాను తెలంగాణలో పుట్టి, పెరిగానని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా టీఆర్ఎస్ సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పైగా రైతు ఆత్మహత్యలను అవమానించేవిధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై మంత్రులు ఎదురుదాడి చేయడం మానుకోవాలని హితవు పలికారు. వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చి.. రైతు ఆత్మహత్యలు నివారించాలని కోరారు. రైతాంగ సమస్యలపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.