
రైతుల ఆత్మహత్యలపై ముందుగా చర్చించాలి: డీకే అరుణ
రైతుల ఆత్మహత్యలపై ముందుగా సభలో చర్చించాలని మాజీ మంత్రి డీకే అరుణ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు రోజుల తర్వాతనైనా ప్రశ్నోత్తరాలు పెట్టుకోవచ్చనని ఆమె ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యపై చర్చించిన తర్వాత ఏ అంశంపైనైనా చర్చించుకోవచ్చవన్నారు.
రైతుల ఆత్మహత్యలపై చర్చకు పట్టుబడితే సభను అడ్డుకుంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దీన్ని బట్టి రైతులు, రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ తీరు స్పష్టమవుతోందన్నారు. పట్టింపులకు పోకుండా రైతుల సమస్యలపై చర్చించాలంటూ మల్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.